NTR: పాఠశాల బస్సు డ్రైవర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన డ్రైవర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యూనిఫామ్, రహదారి భద్రతా నిబంధనలు, సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థుల భద్రతకు పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లు, రవాణా శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల బస్సు డ్రైవర్లకు శిక్షణ: కలెక్టర్


