హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అలర్ట్.. భారీ వర్షాలు

ELR: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం విశాఖపట్నం-గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం సమీపంలో ఇవాళ రాత్రి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో జిల్లాలో ఇవాళ రాత్రి, రేపు విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే, తీరంలో 55-65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.