హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి'

కృష్ణా: ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణను యువత సద్వినియోగం చేసుకోవాలని SC, ST ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డి.సురేష్ బాబు సూచించారు. బుధవారం ట్రస్ట్‌ను సందర్శించిన ఆయన శిక్షణ కార్యక్రమాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఆధునిక సౌకర్యాలతో శిక్షణ అందించడం అభినందనీయమన్నారు.