హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కృషి చేయాలి'

కృష్ణా: అవనిగడ్డ ఐసీడీఎస్ నూతన సీడీపీవో ఈపూరి వాణి బుధవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మాతా శిశు సంక్షేమం, రక్తహీనత నివారణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ షెహనాజ్ బేగం పాల్గొన్నారు.