NTR: నందిగామ మండలం ఇలతవరం సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయిందని స్థానికులు తెలిపారు. ఆటోలో డ్రైవర్ శ్రీనివాస్ (38) ఒక్కరే ఉన్నారని, గంపపల్లి చెందిన ఆయనకు రెండు కాళ్లు, ఒక చేయి విరిగినట్లు సమాచారం. క్షతగాత్రుడిని కీర టోల్ అంబులెన్స్‌లో నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజైన ఆటో


