హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు బయోమెట్రిక్ తప్పనిసరి: కలెక్టర్

W.G: విద్యార్థుల సంక్షేమ పథకాలు, అడ్మిషన్లకు అంతరాయం కలగకుండా 5 నుంచి 7, 15 నుంచి 17 ఏళ్ల విద్యార్థులకు ఆధార్ బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరి అని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం భీమవరం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించి మాట్లాడారు. పాఠశాలలు, సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి 100 శాతం ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.