E.G: సీతానగరం పీహెచ్‌సీని జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎన్. వసుంధర ఆకస్మికంగా తనిఖీ చేసి వైద్య సేవలను సమీక్షించారు. అత్యవసర మందులు, పాముకాటు, కుక్కకాటు మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ నెల 25న 1–19 ఏళ్ల 12,889 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. కుష్ఠు వ్యాధి కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని కూడా పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
సీతానగరం పీహెచ్‌సీని తనిఖీ చేసిన డాక్టర్ వసుంధర


