హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'మృతుల కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించాలి'

ADB: రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలుడు, షార్ట్ సర్క్యూట్ వల్ల పసిపిల్లలు మృతి చెందడానికి ప్రభుత్వ, అధికారుల నిర్లక్ష్యమే కారణమని తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ విమర్శించారు. బుధవారం రిమ్స్‌ను సందర్శించి బాధితులను పరామర్శించారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.