హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైలెవల్ బ్రిడ్జి పనులు ప్రారంభం

ASR: ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ మెట్టగూడ వద్ద పీఎం-జన్మన్ పథకంలో భాగంగా రూ.3.85 కోట్లతో ఐదు స్పాన్ల (5 Span) హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. వంతెన అబుట్‌మెంట్ పునాది తవ్వకం పనులను అధికారులు చేపట్టారు. పనులను నిర్ణీత గడువులో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులు ఈఈ ఎస్.రామకృష్ణ, ఏఈ మురళి ఆదేశించారు.