హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రిజర్వాయర్‌ను పరిశీలించిన సీపీఎం బృందం

ప్రకాశం: పామూరు మండలంలోని ఎండిపోయిన మోపాడు రిజర్వాయర్‌ను సీపీఎం బృందం బుధవారం పరిశీలించింది. సీపీఎం జిల్లా నాయకులు కొమ్మలపాటి మాల్యాద్రి మాట్లాడుతూ.. రిజర్వాయర్‌లో చుక్క నీరు కూడా లేకపోవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు. పామూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని కోరారు.