NZB: నిజామాబాద్ లో వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర మేయర్ కూరగాయల ఉమారాణి పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఇప్పటికే రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి, ప్యాచ్ వర్క్ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
తెలంగాణ
'వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు'


