హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెదిరింపు వాయిస్‌ మెసేజ్‌.. వ్యక్తి అరెస్ట్

SRCL: వినాయక నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాలో బెదిరింపు వాయిస్ మెసేజ్ పంపిన మోతే నితిన్(24)ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిమజ్జనంలో గొడవలు సృష్టిస్తానని, కొందరిని చంపుతానంటూ బెదిరించినట్లు తెలిపారు. నితిన్ నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సోషల్ మీడియాలో చట్టవ్యతిరేక పోస్టులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.