ప్రకాశం: చీమకుర్తిలోని స్థానిక గ్రానైట్ గనులను బుధవారం భారతీయ మజ్దూర్ సంఘ్ రాధాకృష్ణ పరిశీలించారు. అనంతరం క్వారీ జీఎం వెంకటేశ్వరరావుతో మాట్లాడి మైనింగ్ పరిస్థితులపై ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్మికులను కలిసి సమస్యలు, యోగక్షేమాలు తెలుసుకున్నారు. కష్టపడి పనిచేసే కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు తక్షణమే ఈఎస్సై వైద్యశాలను ఏర్పాటు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రానైట్ క్వారీలను పరిశీలించిన రాధాకృష్ణ


