హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాంధీ ఆశ్రమంలో వ్యాసరచన పోటీలు నిర్వహణ

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో బుధవారం అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని పదవ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారుగా కోవూరు నియోజకవర్గస్థాయి నుండి 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు అక్టోబర్ రెండవ తేదీ బహుమతులు ప్రశంస పత్రాలను అందజేస్తామన్నారు.