హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్య వివాహాలు‌పై అవగాహన కార్యక్రమం

NLR: విడవలూరు మండలంలోని ఊటుకూరు వెంకటరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం బాల్యవివాహాల వలన కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేయకూడదన్నారు. అబ్బాయిలతో సమానంగానే ఆడపిల్లలను చూడాలన్నారు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు దాటిన తర్వాతే వివాహం చేయాలన్నారు.