హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒంగోలు నగర అభివృద్ధిపై సమీక్ష

ప్రకాశం: ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు బుధవారం ప్రకాశం భవన్‌లో కలెక్టర్ రాజాబాబుతో సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు నగర అభివృద్ధి, 150 ఏళ్ల వేడుకల నిర్వహణపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నగర అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.