KDP: ఈ నెల 25న మండలంలో నిర్వహించే నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో భాస్కర్ బాబు కోరారు. బుధవారం అట్లూరు ఎంపీడీవో కార్యాలయంలో వైద్యాధికారి డాక్టర్ హమీద బేగం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో 1–19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నులిపురుగుల నివారణకు చర్యలు: MPDO


