HNK: హన్మకొండ నగరంలోని వేయి స్తంభాల ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం ఉత్తిష్ట గణపతి ఆరాధన, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఐరావతం వాహనంపై స్వామివారిని ప్రాచీన కోనేరుకు ఊరేగింపుగా తీసుకెళ్లి శ్రీచక్ర స్నానం నిర్వహించారు. కార్యక్రమంలో సినీ రచయిత తనికెళ్ల భరణి, కుడా ఛైర్మన్ గుండు సుధారాణి దంపతులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రాచీన కోనేరులో గణపతికి శ్రీచక్ర స్నానం


