ASR: సైక్లోన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో హై అలర్ట్ ప్రకటించాలని జేసీ శ్రీపూజ బుధవారం అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలు, గెడ్డలు పొంగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వర్షపాతం, రహదారులు, విద్యుత్, ప్రజా రవాణాపై పర్యవేక్షించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'అన్ని మండలాల్లో హై అలర్ట్ ప్రకటించాలి'


