హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నప్రసాద సత్రానికి భారీ విరాళం

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అన్నప్రసాద సత్రానికి నగుబోతు వీణ–రఘురామ్ దంపతులు రూ.1,01,116 విరాళంగా అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ ఈవో రమాదేవికి నగదు రూపంలో అందించారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. అర్చకులు ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో పర్యవేక్షకుడు ఎడ్ల శివసాయి, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.