హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం..!

SRCL: తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు చివరి అవకాశం కల్పించారు. MPC, BiPC, ఏ అండ్ టీ వొకేషనల్ కోర్సుల్లో ఖాళీ సీట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అర్హులైన గిరిజన బాలికలు ఈ నెల 24 నుంచి 26 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.