హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: పెద్ద తుంబలంలో పైప్‌లైన్ లీక్

KRNL: పెద్ద తుంబలం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన తాగునీటి పైప్‌లైన్ లీక్ కావడంతో రోడ్డు పక్కన భారీ గుంత ఏర్పడి పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. సమస్య తీవ్రంగా ఉన్నా ఏ అధికారి కూడా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.