హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నకరికల్లును కరువు మండలంగా ప్రకటించాలి'

PLD: నకరికల్లును వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన నకరికల్లు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న నకరికల్లులో ధర్నా చేపడుతున్నట్లు రైతు, కౌలు రైతు సంఘాల నేతలు తెలిపారు. బుధవారం కరపత్రాలు విడుదల చేస్తూ.. రూ. 2 లక్షల రుణమాఫీ, పంట నష్టపరిహారం, కౌలు రైతులకు ప్రత్యేక ప్యాకేజీ, 8 రకాల నిత్యవసరాల పంపిణీ అందించాలని డిమాండ్ చేశారు.