హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో వైసీపీ కార్యకర్తలు సమావేశం

నంద్యాల పట్టణంలోని అన్నపూర్ణ ఫంక్షన్ హాల్‌లో బుధవారం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.