హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదల సొంతింటి కల సాకారం'

BDK: అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం భద్రాచలం అంబసత్రం మార్గంలోని కాలనీలో మామిడి మౌనిక నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని మంత్రి ప్రారంభించారు. ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, జారే ఆదినారాయణ, కలెక్టర్‌ అంకిత్‌, ఎస్పీ రోహిత్‌రాజుతో కలిసి గృహప్రవేశంలో పాల్గొన్నారు.