హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

మంచిర్యాల జిల్లా భీమిని మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను మంగళవారం భీమిని పోలీసులు పట్టుకున్నారు. బుధవారం ఎస్సై కోటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం పెద్దపేట గ్రామం వాగు నుంచి జగ్గయ్యపేట గ్రామానికి ఇసుక తరలిస్తున్న మామిడిపల్లికి చెందిన గుర్లె రాజారాం ఇసుక ట్రాక్టర్‌ను పట్టుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు SI తెలిపారు.