హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సర్వీస్‌ ఛార్జీ వసూలు చేస్తే చర్యలు'

కర్నూలు: హోటళ్లు, రెస్టారెంట్లు, కేఫ్‌లలో సర్వీస్‌ ఛార్జీని బలవంతంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని జేసీ నూరుల్‌ ఖమర్‌ హెచ్చరించారు. CCPA మార్గదర్శకాల ప్రకారం సర్వీస్‌ ఛార్జీ తప్పనిసరి కాదని, వినియోగదారుడి ఇష్టానుసారమే చెల్లించాలని స్పష్టం చేశారు. ‘స్టాఫ్‌ వెల్ఫేర్‌ ఛార్జీ’, తదితర పేర్లతో వసూలు చేసినా సర్వీస్‌ ఛార్జీగానే పరిగణిస్తామన్నారు.