హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CMRFతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం'

ASF: కాగజ్ నగర్ మండలం కొత్త సారసాలకు చెందిన పుల్ల అంజన్నకి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ సంబంధ చికిత్స కోసమై సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.2.25 లక్షల LOCని MLA హరీష్ బాబు బుధవారం అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.