హైదరాబాద్: 28°C
తెలంగాణ

DMHO ఆఫీసులో అవినీతి ఆరోపణలు

VKB: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన 17 మంది RMPలపై కేసుల విషయంలో ఓ ఉన్నతాధికారి డబ్బులు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రూ.20 వేల ఫైన్ చలానాతో పాటు మరో రూ.25 వేలు చెల్లించాలని కోరినట్లు ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయంలో పనులు జరగాలంటే ముడుపులు ఇవ్వాల్సి వస్తోందని కొందరు ఉద్యోగులు వాపోతున్నట్లు సమాచారం.