హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చైర్మన్ సీటును ఎస్టీలకు కేటాయించాలని వినతి

తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైయస్ జగన్‌ను, ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుండా సురేంద్రను మంగళవారం గుంతకల్లు నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కొనకొండ్ల అంజి మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ సీటును ఎస్టీలకు కేటాయించాలని కోరారు. జగన్ సానుకూలంగా స్పందించినట్లు అంజి తెలిపారు.