హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ దాడులపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం

ATP: విజయవాడ శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై వైసీపీ గుండాలు భౌతిక దాడి చేయడం అత్యంత దుర్మార్గమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. దాడులు, హింసే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన యువతకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని తెలిపారు.