NRML: దిలావర్‌పూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో అరుణరాణి అధికారులతో మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. శాఖల వారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించి, సమస్యల పరిష్కారానికి సమన్వయంతో చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులపై మండల స్థాయి సమీక్ష


