జగిత్యాల జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుడి శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. గణేష్ మాలాదారులు నిర్వహించిన ఈ ఊరేగింపులో భక్తులు కోలాటాలు వేస్తూ సందడి చేశారు. గణనాథుడి రూపంలో ఓ భక్తుడిని ప్రత్యేకంగా అలంకరించి మూషిక వాహనంపై ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
మూషిక వాహనంపై గణనాథుడి శోభాయాత్ర


