WGL: వర్ధన్నపేటలోని కొనారెడ్డి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం నిర్వహించే ప్రాంతాన్ని ఏసీపీ నరసయ్య, మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణితో కలిసి బుధవారం పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు, గణేష్ విగ్రహాల ఊరేగింపులకు ఇబ్బందులు లేకుండా భద్రత, బారికేడింగ్, విద్యుత్, పారిశుధ్యం, తాగునీరు, లైటింగ్ తదితర ఏర్పాట్లపై చర్చించారు.
తెలంగాణ
'నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన'


