హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీసీ కాలనీలో తాగునీటి సమస్య పరిష్కరించాలి'

WNP: అమరచింత మండలం బీసీ కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 7వ వార్డులో పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని నాయకులు తెలిపారు. మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడకుండా మున్సిపాలిటీ బోర్లకు మరమ్మతులు చేసి నూతన మోటర్లు ఏర్పాటు చేయాలని కోరారు.