హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు యూనిఫామ్ అందించిన ఎమ్మెల్యే

BDK: సమాజ నిర్మాణంలో నిరంతరం చెమటోడ్చే కార్మికుల హక్కుల రక్షణకు, వారి సంక్షేమానికి తాము సంపూర్ణంగా కట్టుబడి ఉంటామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెం నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రెండేళ్లకు సంబంధించిన యూనిఫారాలు, కాస్మొటిక్స్ పంపిణీ చేశారు. కార్మికులు వారి భద్రతకు అధిక ప్రాధన్యత ఇవ్వాలని సూచించారు.