BDK: పాల్వంచ మండలం కరకవాగు ప్రాంతానికి చెందిన ఎండీ.ముబీన్ నివాస గృహం ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ కొత్తగూడెం క్యాంపు కార్యాలయంలో రూ.20 వేలను తక్షణ సాయంగా వారికి అందజేశారు. అనంతరం అధైర్య పడొద్దు అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
అధైర్య పడొద్దు... అండగా ఉంటాం: మంత్రి


