హైదరాబాద్: 28°C
తెలంగాణ

హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు

మెదక్ జిల్లా హజ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా నుంచి హజ్ యాత్రకు వెళ్లనున్న 35 మంది హజ్ యాత్రికులకు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో భాగంగా వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీతా దేవి, హెచ్‌ఓడీ డాక్టర్ రవీందర్ పర్యవేక్షించారు.