SRCL: గంజాయి సేవనానికి అలవాటుపడిన యువకులను డీ-అడిక్షన్ చికిత్స కోసం కేంద్రానికి తరలించినట్లు గంభీరావుపేట పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గంజాయి సేవనానికి బానిసలుగా మారినట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంకటాద్రి చెరువు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, అనుమానాస్పదంగా కనిపించిన యువకులను విచారించారు. అనంతరం వారిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు.
తెలంగాణ
డీ-అడిక్షన్ సెంటర్‌కు ఇద్దరు యువకులు


