హైదరాబాద్: 28°C
తెలంగాణ

డేటింగ్ మోసం.. రూ.4.91 కోట్లు స్వాహా

HYD: డేటింగ్ యాప్ పరిచయంతో ఇజ్జత్ నగర్‌లో ఫ్లాట్ అమ్మిన లాయర్‌ను కేటుగాళ్లు మోసం చేశారు. ‘దిశా’గా పరిచయమైన ముఠా, తర్వాత ‘ఎలినా’ పేరుతో బెదిరించింది. ఏడాదిలో 241 లావాదేవీల ద్వారా రూ.4.91 కోట్లు కొల్లగొట్టింది. ఇందులో రూ.77 లక్షలు నగదు తీసుకుంది. పరువు పోతుందన్న భయంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో మోసం బయటపడింది.