హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించాలి: MLA

BHPL: భక్తితో వినాయక నిమజ్జనం నిర్వహించడంతో పాటు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. నిమజ్జనం సందర్భంగా జాగ్రత్తలు పాటించాలని, పోలీసులకు సహకరించి ప్రశాంతంగా వేడుకలు నిర్వహించాలని కోరారు. భక్తులు చెరువులు, నీటి వనరుల వద్ద జాగ్రత్తగా వ్యవహరించి, పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.