KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తన నివాసంలో తల్లాడ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దుండేటి వీరారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మర్సకట్ల బాబు మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. సిరిపురం మేజర్ కాలువ ద్వారా త్వరగా నీటిని విడుదల చేయాలని వినతి పత్రం అందించారు. కాలువ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే నీటిని విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ
కాలువకు నీటిని విడుదల చేయాలని వినతి


