హైదరాబాద్: 28°C
తెలంగాణ

'49 వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలి'

కామారెడ్డి పట్టణ కేంద్రంలోని 49 వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పర్వతాలుకు వినతిపత్రం అందజేశారు. పలుమార్లు వినతి పత్రాలు అందజేసి, వార్డుల్లో నెలకొన్న సమస్యల పట్ల వివరిస్తున్నప్పటికీ పరిష్కరించడం లేదని, అందుకే పదేపదే గుర్తు చేస్తూ విన్నవిస్తున్నట్లు కౌన్సిలర్లు పేర్కొన్నారు.