హైదరాబాద్: 28°C
తెలంగాణ

లారీ బోల్తా..ఇద్దరికి గాయాలు

KMR: ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన టేక్రియాల్ బైపాస్ శివారులో 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు ఆలుగడ్డలను తీసుకువెళ్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.