హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి

KMR: కామారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు పూర్తి చేశామని మున్సిపల్ ఛైర్మన్ ఉమారాణి శ్రీనివాస్ చెప్పారు. చెరువు వద్ద ఏర్పాటు చేసిన క్రేన్లకు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. చెరువు వద్ద వినాయకుల నిమజ్జనం చేసే భక్తులకు ఇబ్బందులు లేకుండా మున్సిపల్ శాఖ అన్ని వసతులు కల్పించిందని చెప్పారు.