హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యకర్తలకు అండగా ఉంటా: ఎర్రబెల్లి

JN: దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బుధవారం పర్యటించారు. ఇటీవల మృతి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుల కుటుంబాలను పరామర్శించి సంతాపం తెలిపారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని, పార్టీ వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.