హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాటర్ హీటర్ పేలి ఇల్లు దగ్ధం

MDCL: మేడ్చల్ PS పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమారంలో వాటర్ హీటర్ పేలి ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. హీటర్ పెట్టి బాధితుడు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు బల్గురి మహేశ్ తెలిపారు. రెండున్నర క్వింటాళ్ల బియ్యం, దుస్తులు, నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు కాలిపోయాయి.