హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జిల్లాలో ప్రారంభమైన గణపతి నిమజ్జనాలు

WGL: వరంగల్ నగరంలో బుధవారం గణపతి నిమజ్జన శోభాయాత్రలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా అలంకరించిన వినాయక విగ్రహాలను భక్తులు డప్పుచప్పుళ్లు, డీజే సంగీతం నడుమ ఉత్సాహంగా ఊరేగించారు. భక్తుల జయజయధ్వానాలతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎలాంటి అవాంఛానీయమైన సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.