హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితుడికి ఫోన్ అప్పగించిన రాయపర్తి పోలీసులు

WGL: రాయపర్తి మండలం టీకే తండాకు చెందిన బానోతు తార్య మిస్సింగ్‌ మొబైల్‌ ఫోన్‌ను రాయపర్తి పోలీసులు CEIR పోర్టల్‌ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక సమాచారంతో ఫోన్‌ ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఎస్సై ముత్యం రాజేందర్‌ చేతుల మీదుగా బాధితుడికి ఫోన్‌ను అప్పగించారు. ఫోన్‌ను తిరిగి అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.