హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ ఎంపీటీసీకి నివాళులర్పించిన ఎమ్మెల్యే

KNR: చొప్పదండి మండలం చాకుంట మాజీ ఎంపీటీసీ సభ్యుడు గోపు నరేందర్‌రెడ్డి పిడుగుపాటుకు గురై మృతి చెందారు. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చాకుంటలోని ఆయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.